ఎన్నికల్లో ఓటమి తరువాత, ఎన్నాళ్లకు కనిపించారు సారూ ? ట్రంప్ ఫస్ట్ పబ్లిక్ అపియరెన్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ జనాల్లో కనిపించలేదు. వైట్ హౌస్ ను వీడలేదు. కాస్త తీరిక చేసుకుని ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ జనాల్లో కనిపించలేదు. వైట్ హౌస్ ను వీడలేదు. కాస్త తీరిక చేసుకుని వాషింగ్టన్ శివార్లలోని గోల్ఫ్ కోర్స్ మైదానంలో గోల్ఫ్ ఆడుతూ కనిపించారు తప్ప.. ‘బహిరంగ ‘దర్శనమైతే ఇవ్వలేదు. అయితే బుధవారం మాత్రం జనాలకు ఇన్నాళ్లకు మొదటిసారిగా ఆయనను చూసే భాగ్యం కలిగింది. భార్య మెలనియాతో కలిసి ట్రంప్ ఆర్లింగ్టన్ లోని అమరవీరుల మెమోరియల్ వద్దకు వచ్చి..వారికి నివాళులర్పించారు. మెమోరియల్ వద్ద పుష్పగుఛ్చాలుంచారు. వర్షం పడుతున్నా గొడుగులు పట్టుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా తండ్రిని అనుసరించింది. మరోవైపు- అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ కూడా తన భార్య జిల్ తో కలిసి ఫిలడెల్ఫియా లో అమరవీరులకు నివాళులర్పించారు.
Video Courtesy: Mail Online