ఛానల్ మారినా టాప్ రేటింగ్‌లో ‘రామాయణం’!
1987-88 మధ్య ఏడాదిన్నరపాటు ప్రసారం అయిన రామాయణ్ సీరియలల్ టెలివిజన్ చరిత్రలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియల్ కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో మరోసారి
1987-88 మధ్య ఏడాదిన్నరపాటు ప్రసారం అయిన రామాయణ్ సీరియల్ టెలివిజన్ చరిత్రలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియల్ కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో మరోసారి బుల్లితెరపై కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం ప్రస్తుతం దంగల్ అనే ఛానల్‌లో ప్రసారమవుతోంది. తాజాగా బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన నివేదిక ప్రకారం టెలివిజన్‌లో ఎక్కువ మంది తిలకించే కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.
ఆగస్టు 1 నుంచి 7 వరకు భారతీయ ప్రేక్షకులు టీవీల్లో ఏయే కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించారనే దానిపై బార్క్ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ఆధారంగా టీఆర్‌పీల పరంగా రామాయణం ఇప్పటికీ టాప్ రేటింగ్‌లో దూసుకుపోతుందని పేర్కొంది. జీ టీవీలో వస్తున్న శ్రద్ధా ఆర్య, ధీరజ్ ధూపర్ నటించిన కుండలి భాగ్య సీరియల్ రెండో స్థానంలో ఉంది. అలాగే మహిమా శనిదేవ్ కీ మూడవ స్థానంలో కొనసాగుతంది. దూరదర్శలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానం, స్టార్ ప్లస్‌లో ప్లే అవుతున్న అనుపమ అయిదో స్థానం దక్కించుకున్నాయి.
Read More:
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!