సీఎం కాన్వాయ్ నే ఆపేసిన ట్రాఫిక్ సీఐ..
హైదరాబాద్ పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అందరూ సమానమే అన్న విషయం మరోమారు నిరూపించుకున్నారు. నగరంలోని పంజాగుట్ట సీగ్నల్ వద్ద జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. పంజాగుట్ట ట్రాఫిక్ సిగ్నల్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు మొగిలిచెర్ల రవి..అయితే, సోమవారం సాయంత్రం ఆ రోడ్డు మార్గంలో సీఎం కాన్వాయ్ వస్తుండగా, అదే సమయంలో సైరన్ మొగిస్తూ..ఓ అంబులెన్స్ వచ్చింది. దీంతో సమయస్పూర్తిని ప్రదర్శించిన రవి..సీఎం కాన్వాయ్ ని కాసేపు ఆపి..అంబులెన్స్ కు దారిచ్చాడు. […]
హైదరాబాద్ పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అందరూ సమానమే అన్న విషయం మరోమారు నిరూపించుకున్నారు. నగరంలోని పంజాగుట్ట సీగ్నల్ వద్ద జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. పంజాగుట్ట ట్రాఫిక్ సిగ్నల్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు మొగిలిచెర్ల రవి..అయితే, సోమవారం సాయంత్రం ఆ రోడ్డు మార్గంలో సీఎం కాన్వాయ్ వస్తుండగా, అదే సమయంలో సైరన్ మొగిస్తూ..ఓ అంబులెన్స్ వచ్చింది. దీంతో సమయస్పూర్తిని ప్రదర్శించిన రవి..సీఎం కాన్వాయ్ ని కాసేపు ఆపి..అంబులెన్స్ కు దారిచ్చాడు. అంబులెన్స్ వెళ్లిపోయిన తర్వాత తిరిగి యదావిధిగా కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిపోయింది. దీంతో సీఐ రవి బాధ్యతాయుతమైన పనికి అతన్ని అందరూ మెచ్చుకున్నారు.