Tourists: టూరిస్టులు అలర్ట్.. ఆ రెండు పర్యాటక ప్రాంతాల్లోకి నో ఎంట్రీ, ఎందుకంటే..

|

Feb 20, 2024 | 1:01 PM

ఫిబ్రవరి 21 నుంచి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరను పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామప్ప, లక్నవరం సరస్సులను ఫిబ్రవరి 26 వరకు సందర్శకుల కోసం మూసివేయనున్నారు. రెండు పర్యాటక ప్రాంతాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్, రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tourists: టూరిస్టులు అలర్ట్.. ఆ రెండు పర్యాటక ప్రాంతాల్లోకి నో ఎంట్రీ, ఎందుకంటే..
Laknavaram
Follow us on

ఫిబ్రవరి 21 నుంచి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరను పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామప్ప, లక్నవరం సరస్సులను ఫిబ్రవరి 26 వరకు సందర్శకుల కోసం మూసివేయనున్నారు. రెండు పర్యాటక ప్రాంతాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్, రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో రామప్ప ఆలయం, లక్నవరం సరస్సును దర్శించుకుంటారు. భక్తుల రవాణ సౌకర్యం ద్రుష్టిలో పెట్టుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు మహిళా భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఎలాంటి గందరగోళం వద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

కాగా తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ మహా జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాయి. అయితే రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను నడపుతోంది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నందున రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.

మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మేడారం జాతరకు సమాంతరంగా 24 చోట్ల సమ్మక్క-సారలమ్మ మినీ జాతరలకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోలివాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామం, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చిల్వ కుదూర్ గ్రామాల్లో జరిగే జాతరలకు భక్తులు భారీగా తరలివస్తారు.