AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భవిష్యత్ లో ఉద్యమం వస్తుంది

కరోనా పేరుతో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమం వస్తుందని సినీ నిర్మాత, ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ జాయింట్ సెక్ర‌ట‌రీ నట్టికుమార్ అన్నారు. అన్ లాక్ లో భాగంగా అన్నింటికీ పర్మిషన్లు ఇచ్చారు..

భవిష్యత్ లో ఉద్యమం వస్తుంది
Pardhasaradhi Peri
|

Updated on: Sep 08, 2020 | 5:10 PM

Share

కరోనా పేరుతో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమం వస్తుందని సినీ నిర్మాత, ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ జాయింట్ సెక్ర‌ట‌రీ నట్టికుమార్ అన్నారు. అన్ లాక్ లో భాగంగా అన్నింటికీ పర్మిషన్లు ఇచ్చారు కానీ ధియేటర్ లకి ఇస్తే వచ్చే ప్రమాదం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా థియేటర్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల సినిమా హాల్స్ దెబ్బతింటున్నాయని, కొన్ని థియేటర్స్‌లో ఫర్నీచర్ నాశనం అవుతుందని, మరికొన్ని థియేటర్స్‌లలో ఫర్నీచర్ చోరీకి గురైన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు. థియేటర్లు మూతపడడం వలన చాలా మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ధియేటర్ లు మూతపడడంతో కొన్ని సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారని.. అయితే ఓటీటీ వేదికగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలు కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని, వారికి ఇలాంటి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన ఘనత కూడా థియేటర్లకే దక్కుతుందని అన్నారు. థియేటర్ల రీఓపెన్ అంశంపై టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వాలతో మాట్లాడాలని ఆయన కోరారు.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?