బ్రేకింగ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధరలు..!
పసిడి ప్రియులకు ఈ వార్త.. గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 35వేల రూపాయలకు పడిపోయింది. గత రెండు నెలలుగా.. హెచ్చతగ్గులకు లోనవుతూ వస్తోన్న బంగారం.. రెండు మూడు రోజులుగా.. తగ్గుతూ వస్తోంది. ఈ నెల మొదలులో కూడా.. హయ్యెస్ట్ రికార్డును క్రాస్ చేసిన బంగారం.. నెలాఖరు వచ్చేసరికి.. కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.39,055 కాగా.. 10 […]
పసిడి ప్రియులకు ఈ వార్త.. గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 35వేల రూపాయలకు పడిపోయింది. గత రెండు నెలలుగా.. హెచ్చతగ్గులకు లోనవుతూ వస్తోన్న బంగారం.. రెండు మూడు రోజులుగా.. తగ్గుతూ వస్తోంది. ఈ నెల మొదలులో కూడా.. హయ్యెస్ట్ రికార్డును క్రాస్ చేసిన బంగారం.. నెలాఖరు వచ్చేసరికి.. కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.39,055 కాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల ధర రూ.36,154లుగా ఉంది.
కాగా.. దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే.. బంగారంతో పాటుగా.. వెండి కూడా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి రూ.48,840లుగా ఉంది.
కాగా.. వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు:
- ఢిల్లీ : 24 క్యారెట్స్ – 39,150, 22 క్యారెట్స్ – 36,450
- చెన్నై: 24 క్యారెట్స్ – 39,410, 22 క్యారెట్స్ – 36,130
- ముంబాయి: 24 క్యారెట్స్ – 39,410, 22 క్యారెట్స్ – 36,130
- విజయవాడ: 24 క్యారెట్స్ – 39,115, 22 క్యారెట్స్ – 35,900
- విశాఖపట్నం: 24 క్యారెట్స్ – 39,120, 22 క్యారెట్స్ – 36,050