AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేఏసీ కారణంగానే ఆర్టీసీ సమ్మె విఫలంః మహమూద్‌

ఆర్టీసీ కార్మికుల సమ్మె విఫలం కావడానికి ఆర్టీసీ జేఏసీయే ప్రధాన కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్‌ఎంయూ మాజీ ప్రధాన కార్యదర్శి మహమూద్‌. ప్రభుత్వంతో కార్మికుల డిమాండ్లను నెరవేర్చేలా చేయడం జేఏసీ నేతలకు చేతకాలేదని విమర్శించారు. గుర్తింపు సంఘంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో సానుకూలంగా ఉంటూ..తమ డిమాండ్లను విజ్ఞప్తి చేస్తూ ఉండాలని, అలా కాకుండా సమ్మె పేరుతో ముఖ్యమంత్రిని ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంతో కార్మికులకు చేటు జరిగిందన్నారు. అవగాహన లేకుండా ముక్కుసూటి ధోరణితో 48 వేల […]

జేఏసీ కారణంగానే ఆర్టీసీ సమ్మె విఫలంః మహమూద్‌
Pardhasaradhi Peri
|

Updated on: Nov 26, 2019 | 5:37 PM

Share

ఆర్టీసీ కార్మికుల సమ్మె విఫలం కావడానికి ఆర్టీసీ జేఏసీయే ప్రధాన కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్‌ఎంయూ మాజీ ప్రధాన కార్యదర్శి మహమూద్‌. ప్రభుత్వంతో కార్మికుల డిమాండ్లను నెరవేర్చేలా చేయడం జేఏసీ నేతలకు చేతకాలేదని విమర్శించారు. గుర్తింపు సంఘంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో సానుకూలంగా ఉంటూ..తమ డిమాండ్లను విజ్ఞప్తి చేస్తూ ఉండాలని, అలా కాకుండా సమ్మె పేరుతో ముఖ్యమంత్రిని ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంతో కార్మికులకు చేటు జరిగిందన్నారు. అవగాహన లేకుండా ముక్కుసూటి ధోరణితో 48 వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ..గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కమిటీ నివేదిక ప్రకారం విలీనం సాధ్యమో, కాదో ప్రభుత్వమే తేలుస్తుందని చెప్పారు. ఏదేమైనప్పటికీ కార్మికులు, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దయతో ఆర్టీసీ కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని మహమూద్‌ విజ్ఞప్తి చేశారు.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?