చ‌లి కాలంలో చ‌ర్మ పొడిబారుతోందా… మెరుస్తూ మునప‌టిలా నిగ‌నిగ‌లాడాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..

చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు చిన్నాపెద్దా తేడా లేకుండా అంద‌రి చ‌ర్మాలు పొడిబారిపోతుంటాయి. ప‌గుళ్లు, చ‌ర్మం తెల్ల‌గా పేల‌డం జ‌రుగుతూ ఉంటుంది. అయితే చ‌ర్మ పొడిబారకుండా ఉండాలంటే, మునప‌టిలా నిగ‌నిగ‌లాడాలంటే..

చ‌లి కాలంలో చ‌ర్మ పొడిబారుతోందా... మెరుస్తూ మునప‌టిలా నిగ‌నిగ‌లాడాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..
Follow us

|

Updated on: Nov 30, 2020 | 5:11 PM

చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు చిన్నాపెద్దా తేడా లేకుండా అంద‌రి చ‌ర్మాలు పొడిబారిపోతుంటాయి. ప‌గుళ్లు, చ‌ర్మం తెల్ల‌గా పేల‌డం జ‌రుగుతూ ఉంటుంది. అయితే చ‌ర్మ పొడిబారకుండా ఉండాలంటే, మునప‌టిలా నిగ‌నిగ‌లాడాలంటే ఈ చిట్కాల‌ను ప్ర‌య‌త్నించండి. మీ చ‌ర్మ దుర‌ద‌పెట్ట‌కుండా, పొడిబార‌కుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. అప్పుడే శీతాకాలం లో సైతం చక్కని చర్మ సౌద‌ర్యం మీ సొంతమౌతుంది.

నీరు తాగండి: చ‌లి కాలంలో నీరు తాగాల‌ని అనిపించ‌దు. దాంతో నీరు తాగడం మర్చిపోతాం. కానీ, క్ర‌మం త‌ప్ప‌కుండా నీరు తాగాలి. నీరు తీసుకోవ‌డం ద్వారా చ‌ర్మ పొడిబారిపోవ‌డం త‌గ్గిపోతుంది. కావాలంటే మీరు రెగ్యూల‌ర్‌గా నీరు తాగి చూడ‌డండి. తేడా మీకే తెలుస్తుంది.

మాయిశ్చరైజర్ మార్చండి:  మీరు సమ్మర్ లో, లేదా వానాకాలం లో వాడే మాయిశ్చరైజర్ ఇప్పుడు పనికి రాదు. ఇంకా రిచ్ గా, ఆయిల్ బేస్ గా ఉండే మాయిశ్చరైజర్ తీసుకోండి. వీలున్నంత వరకూ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం మంచిది.

హ్యుమిడిఫైయర్ తీసుకోండి: వింటర్ లో హ్యుమిడిటీ తక్కువగా ఉంటుంది. అందుకే ఒక హ్యుమిడిఫైయర్ ని ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు.

కూరగాయలు తినండి: యాంటీ ఆక్సిడెంట్ ఉన్న కూర‌గాయ‌ల‌ను తీసుకోండి. చిలగడదుంపలు, క్యారెట్స్, క్యాప్సికం, గుమ్మడికాయ వంటి వాంటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ స్కిన్ కి మేలు చేస్తాయి. విటమిన్స్ ఏ, బీ, ఈ, ఐరన్ ఉంటాయి.

ఒమేగా-3: మీ చేతులు మెత్తగా మృదువుగా లేవంటే మీకు ఒమేగా 3 సరిపడినంత లేదని కూడా సూచన కావచ్చు. సాల్మన్, ఆలివ్ ఆయిల్, వాల్నట్స్ లో ఈ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.

ర‌సాయ‌నాల‌తో కూడిన స‌బ్బుల‌ను వాడ‌కండి: శ‌రీరంలో చ‌ర్మం అతి పెద్ద అవయవం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆల్కహాల్, ఫ్రాగ్రెన్స్ , ర‌సాయ‌న‌లు ఉన్న సబ్బుల‌ను వాడ‌కండి. ఇవి చర్మం మీద సహజం గా ఉండే నూనెలని తీసేస్తాయి.

గోరు వెచ్చని నీరే మంచిది: ఈ కాలం లో వేడి నీటి స్నానం వల్ల హాయిగా ఉంటుంది కానీ, స్కిన్ కి మాత్రం అది హాని చేస్తుంది. అందుకే గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె స్కిన్ కేర్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగిన డ్యామేజ్ ని తగ్గిస్తుంది. స్కిన్ యంగ్ గా కనిపించేటట్లు చేస్తుంది.

దానిమ్మ పండు: దానిమ్మ పండు లో యాంటీ ఆక్సిడెంట్స్ సెల్ ఏజీయింగ్ ని అడ్డుకుంటాయని పరిశోధనల్లో తెలిసింది. దానిమ్మ పండు తిన్నా, జ్యూస్ తాగినా మంచిదే.