శ్రీవారి భక్తులకు శుభవార్త, వర్చువల్ సేవా టికెట్లు విడుదల, రోజుకు ఎన్నో తెలుసా..?

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త వచ్చేసింది. వర్చువల్‌ సేవా టిక్కెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌ కోటాను

శ్రీవారి భక్తులకు శుభవార్త, వర్చువల్ సేవా టికెట్లు విడుదల, రోజుకు ఎన్నో తెలుసా..?
Follow us

|

Updated on: Nov 28, 2020 | 7:33 AM

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త వచ్చేసింది. వర్చువల్‌ సేవా టిక్కెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌ కోటాను అందుబాటులో ఉంచింది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకార సేవల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. రోజుకు 5 వేల టిక్కెట్ల చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. టిక్కెట్లు పొందిన భక్తుల వివరాలను సేవ జరిగే సమయంలో స్వామివారి ముందు ఉంచి ఆశీస్సులు అందజేశారు. సేవా టిక్కెట్లు పొందిన భక్తుల పేరిట అర్చకులు సేవలను నిర్వహిస్తారు.

తిరుమల వెంకన్నకు జరిగే సేవలను టీటీడీ ఎస్వీబీసీ ఛానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సేవా టికెట్లు పొందిన భక్తులు తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకుంటే వారికి వర్చువల్‌ సేవా టిక్కెట్టుతో పాటుగా ప్రత్యేక ప్రవేశదర్శనం టిక్కెట్లను అందుబాటులో ఉంచారు.

Also Read : నేడు హైదరాబాద్‌కు ప్రధాని, స్వాగతం పలకడానికి సీఎం అవసరం లేదట