తిరుమల శ్రీవారి దర్శనంలో ఊహించ‌ని మార్పులు..

మ‌హమ్మారి కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంక‌టేశ్వ‌రస్వామి ఆలయం మీద పడటంతో… బోర్డు భక్తుల ప్రవేశాలు నిషేధించిన సంగ‌తి తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు స్వామి వారి నిత్య కైంకర్యాలు యధావిధిగా జరుగుతున్నా.. భక్తుల దర్శనాలకు మాత్రం పర్మిష‌న్ లేదు. లాక్​డౌన్ ఎత్తివేసిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను ఎలా అనుమతి ఇవ్వాల‌నే అంశంపై టీటీడీ స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన విధానాల్లో భారీ మార్పులు జరగనున్నట్లు స‌మాచారం అందుతోంది. శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో […]

తిరుమల శ్రీవారి దర్శనంలో ఊహించ‌ని మార్పులు..
Follow us

|

Updated on: May 13, 2020 | 4:33 PM

మ‌హమ్మారి కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంక‌టేశ్వ‌రస్వామి ఆలయం మీద పడటంతో… బోర్డు భక్తుల ప్రవేశాలు నిషేధించిన సంగ‌తి తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు స్వామి వారి నిత్య కైంకర్యాలు యధావిధిగా జరుగుతున్నా.. భక్తుల దర్శనాలకు మాత్రం పర్మిష‌న్ లేదు. లాక్​డౌన్ ఎత్తివేసిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను ఎలా అనుమతి ఇవ్వాల‌నే అంశంపై టీటీడీ స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన విధానాల్లో భారీ మార్పులు జరగనున్నట్లు స‌మాచారం అందుతోంది.

శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి వేచిచూసే భక్తులకు టీటీడీ అన్న ప్రసాద వితరణ, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, వసతి గృహాల్లో బస…శ్రీవారి దర్శనంలో సాధారణంగా ఉండే ఈ విధానాలన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. లాక్‌డౌన్‌ గడువు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టం.. అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ఏరియాల్లో మినహా మిగిలిన చోట్ల మినహాయింపులు ఇస్తున్న క్రమంలో టీటీడీ ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు భౌతిక దూరం పాటిస్తూ.. తిరుమల శ్రీవారిని దర్శంచుకోవడానికి వీలుగా భక్తులను నియంత్రించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

తిరుమల, తిరుపతి ప్రాంత వాసులను ఆలయంలోకి అనుమతించి భౌతిక దూరం పాటించడం…భ‌క్తుల మ‌ధ్య ఒత్తిడి లేకుండా శ్రీవారి దర్శనం అమలు అంశాలను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. క్యూకాంప్లెక్స్‌లను మూసివేయనున్నారు. దర్శనం అనంతరం తిరుమల నుంచి కిందకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోనున్నారు. భౌతిక దూరం పాటిస్తే..రోజుకు ఎంత‌మంది శ్రీవారిని దర్శించుకోవడానికి రోజుకు ఎంత మంది భక్తులకు వీలవుతుందన్న అంశంపై క్లారిటీ వ‌చ్చేలా చ‌ర్య‌లు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఆర్జిత సేవలు…ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లను విక్రయిస్తుండగా…తాజాగా సర్వదర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో అందచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి నేరుగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని వెనుదిరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..