నేటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. స్వామివారి సర్వసైన్యాధక్షడైన విష్వక్సేనుడు రాత్రి 7గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి పడమటి మాడవీధుల్లోని వసంత మంటపానికి వేంచేస్తాడు. అక్కడ అర్చకస్వాములు పుట్టమన్ను సేకరించి నవపాలికలలో ఉంచుకొని ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి వస్తారు. యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించి పాలికలలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేసే ప్రక్రియను వైదికంగా నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లవుతుంది. ఇక […]

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. స్వామివారి సర్వసైన్యాధక్షడైన విష్వక్సేనుడు రాత్రి 7గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి పడమటి మాడవీధుల్లోని వసంత మంటపానికి వేంచేస్తాడు. అక్కడ అర్చకస్వాములు పుట్టమన్ను సేకరించి నవపాలికలలో ఉంచుకొని ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి వస్తారు. యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించి పాలికలలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేసే ప్రక్రియను వైదికంగా నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లవుతుంది. ఇక ఈ నెల 13న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక రేపు సాయంత్రం ప్రభుత్వం తరపున ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారి పెద్దశేష వాహనం ఊరేగింపు సేవలో పాల్గొననున్నారు. తరువాత మరుసటి ఉదయం తిరుమల నుంచి జగన్ తిరుగు ప్రయాణం అవుతారు.