AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: దమ్ముంటే ఆ ఆంటీకి పంపు.. ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

టీమిండియా క్రికెటర్‌ తిలక్‌ వర్మ తాజాగా సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌ రీనుతో కలిసి చేసిన రీల్‌ వైరల్‌గా మారింది. ఇందులో తిలక్‌ తన సహజమైన హావభావాలతో అదరగొట్టాడు. ఎలాంటి డైలాగులు లేకపోయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు.

Video: దమ్ముంటే ఆ ఆంటీకి పంపు.. ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
Tilak Varma Reenu
SN Pasha
|

Updated on: Aug 12, 2026 | 11:33 AM

Share

టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో బయట అంత సరదాగా ఉంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే క్రికెట్ ఫ్యాన్స్‌కు బాగా తెలుసు. టీమ్ మెట్స్‌తో కలిసి సరదాగా ఉన్న వీడియోలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా తిలక్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీనుతో ఓ రీల్‌లో నటించాడు. అయితే ప్రోఫెషన్ పరంగా క్రికెటర్ అయిన తిలక్ ఈ రీల్‌లో మాత్రం చాలా నేచ్యురల్‌గా నటించాడు.

తన కూమారుడి కంటే ఎక్కువ సంపాదించే చుట్టాల అబ్బాయిని చూసి అసూయపడే ఓ ఆంటీ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ రీల్‌లో రీను అసూయపడే ఆంటీలా నటిస్తే, తిలక్ డెవలప్ అయిన కుర్రాడిలా నటించాడు. డైలాగులు లేకపోయినా కేవలం హావభావాలతో ఇద్దరూ అదరగొట్టారు. ఈ రీల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన రీను.. దమ్ముంటే ఈ వీడియోని అసూయ పడే మీ చుట్టాల ఆంటీకి పంపండి అంటూ పేర్కొంది. కాగా ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే భారీగా వ్యూస్, లైక్స్ వచ్చేశాయి. మరి క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మన తెలుగు కుర్రాడు తిలక్‌కు సినిమా ఇండస్ట్రీలోనూ మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ రీల్ చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ మీరు రీల్ చూశారా? కింద ఉంది చూసేయండి..

View this post on Instagram

A post shared by Reenu (@reenu_debnath)

Follow Us