AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Fear in Telangana: తెలంగాణలో పెద్దపులి సంచారం.. హడలిపోతున్న పలు జిల్లాల ప్రజలు.. ఈసారి ఏకంగా గ్రామాల్లోనే..

ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యా్ప్తంగా పలు జిల్లాల్లో పులుల సంచారం ఎక్కువవుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు అధికంగా గల ఉమ్మడి ఆదిలాబాద్,

Tiger Fear in Telangana: తెలంగాణలో పెద్దపులి సంచారం.. హడలిపోతున్న పలు జిల్లాల ప్రజలు.. ఈసారి ఏకంగా గ్రామాల్లోనే..
Shiva Prajapati
|

Updated on: Dec 25, 2020 | 5:32 AM

Share

Tiger Fear in Telangana: ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యా్ప్తంగా పలు జిల్లాల్లో పులుల సంచారం ఎక్కువవుతోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు అధికంగా గల ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు పులి సంచారం అక్కడి ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణం ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆశ్వారావు పేట, దమ్మపేట మండలాల్లో పులి సంచారినికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. ముఖ్యంగా, ఆశ్వారావుపేట మండలం తిరుమల కుంట కాలనీ గ్రామం సమీపంలో పెద్ద పులి పాద ముద్రలు కనిపించాయి. దాంతో ఆ గ్రామ ప్రజలు హడలిపోయారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు.. పులి కదలికలను గుర్తించేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఒంటరిగా ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Also read:

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ జట్టును వీదనున్న విలియమ్సన్.? క్లారిటీ ఇచ్చిన డేవిడ్ వార్నర్..

India Vs Australia 2020: విన్నింగ్ టీంతోనే బరిలోకి దిగనున్న కంగారూలు.. మరి టీమిండియా సంగతేంటి.?