StrainVirus: అమ్మో ఇది నిజమేనా?.. కొత్త ‘స్ట్రెయిన్‌’ వైరస్ గురించి సంచలన విషయాన్ని వెల్లడించిన ‘లండన్ స్కూల్’ అధ్యయనం..

ఇప్పటికే ఉన్న కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోతుంటే.. ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ జనాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

StrainVirus: అమ్మో ఇది నిజమేనా?.. కొత్త ‘స్ట్రెయిన్‌’ వైరస్ గురించి సంచలన విషయాన్ని వెల్లడించిన ‘లండన్ స్కూల్’ అధ్యయనం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 25, 2020 | 5:16 AM

Strain Virus: ఇప్పటికే ఉన్న కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోతుంటే.. ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ జనాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఓవైపు కొందరు నిపుణులు స్ట్రెయిన్ వైరస్‌కు భయపడాల్సిన పనిలేదని చెబుతుండగా.. మరోవైపు పెను ముప్పు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సంచలన విషయాన్ని వెల్లడించింది. స్ట్రెయిన్ వైరస్ అంత్యంత ప్రమాదకరమని తేల్చింది. వారు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని ప్రకటించారు. కొత్త స్ట్రెయిన్ వల్ల చాలా మంది మృత్యువాత పడుతారని పేర్కొంది. వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉంటుందని, ఆస్పత్రులు సైతం సరిపోని పరిస్థితి రావొచ్చంటూ హడెలెత్తించింది. కాగా, కరోనా రూపాంతరం చెంది స్ట్రెయిన్ వైరస్‌గా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఈ స్ట్రెయిన్ కేసులు యూకేలో అత్యధికంగా నమోదు అవుతున్నాయి. దాంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. యూకేతో రాకపోకలు అన్నీ నిలిపివేశాయి.

Also read:

Breaking: నైజీరియాలో మరో కొత్తరకం కరోనా..ప్రపంచ దేశాలు అలెర్ట్.. తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో ‘స్ట్రెయిన్’ వైరస్ లేదు.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.!