Merry Christmas 2020: క‌్రిస్మ‌స్ పండ‌గ ప్ర‌త్యేకత‌ ఏమిటి..? క్రిస్మ‌స్‌ను ఎలా జ‌రుపుకొంటారు..?

ఏసుక్రీస్తు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా క్రైస్త‌వులు జ‌రుపుకొనే పండ‌గ క్రిస్మ‌స్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్త‌వులు ఈ పండ‌గ‌ను ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. అయితే క్రిస్మ‌స్ ఎలా వ‌చ్చిందో ...

Merry Christmas 2020: క‌్రిస్మ‌స్ పండ‌గ ప్ర‌త్యేకత‌ ఏమిటి..? క్రిస్మ‌స్‌ను ఎలా జ‌రుపుకొంటారు..?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 25, 2020 | 1:50 PM

ఏసుక్రీస్తు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా క్రైస్త‌వులు జ‌రుపుకొనే పండ‌గ క్రిస్మ‌స్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్త‌వులు ఈ పండ‌గ‌ను ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. అయితే క్రిస్మ‌స్ ఎలా వ‌చ్చిందో ప‌లువురు క్రిస్టియ‌న్ల పెద్ద‌లు వివ‌రిస్తున్నారు. మేరీకి క‌నిపించిన దేవ‌దూత రోమ‌న్ సామ్రాజ్యంలోని న‌జ‌రేతు ప‌ట్ట‌ణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. అయితే ఒక రోజుమేరీకి గాబ్రియేల్ అనే దేవ‌దూత క‌ల‌లో క‌న‌బ‌డి క‌న్య‌గానే గ‌ర్భం దాల్చి ఓ కుమారునికి జ‌న్మ‌నిస్తావ‌ని తెలిపింద‌ట‌. అంతేకాదు పుట్టే బిడ్డ‌కు ఏసు అని పేరు పెట్టాల‌ని, అత‌డు దేవుని కుమారుడు అని దేవ‌దూత చెప్పాడ‌ట‌. ఏసు అంటే ర‌క్ష‌కుడ‌ని అర్థం. అయితే దేవ‌దూత చెప్పిన విధంగానే మేరీ గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యం తెలిసిన జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోరాద‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఒక రోజు రాత్రి క‌ల‌లో అత‌నికి దేవ‌దూత క‌నిపించి మేరీని నీవు విడిచిపెట్ట వ‌ద్దు.. ఆమె భ‌గ‌వంతుని వ‌రం వ‌ల్ల గ‌ర్భ‌వ‌తి అయింది కాబ‌ట్టి ఆమెకు పుట్టే బిడ్డ దేవుని కుమారుడు. త‌న‌ను న‌మ్మిన ప్ర‌జ‌లంద‌రిని వాళ్ల పాపాల నుంచి ర‌క్షిస్తాడు అని చెప్పాడు.

ప‌శువుల పాక‌లో జ‌న్మించిన త‌ర్వాత జోసెప్ మేరీ స్వ‌గ్రామం బెత్లేహేమ్‌కు వెళ్లారు. తీరా అక్క‌డ‌కు చేరుకునేస‌రికి ఉండేందుకు ఎలాంటి వ‌స‌తి ల‌భించ‌లేదు. చివ‌ర‌కు ఒక స‌త్రం య‌జ‌మాని త‌న ప‌శువుల పాక‌లో వారికి ఆశ్ర‌యం ఇచ్చాడు. అక్క‌డే మేరీ ఏసుకు జ‌న్మ‌నిచ్చింది. అలా రెండు వేల సంవ‌త్స‌రాల కింద‌ట డిసెంబ‌ర్ 24న అర్థ‌రాత్రి 12 గంట‌ల త‌ర్వాత జీస‌స్ జ‌న్మించాడు. అంటే డిసెంబ‌ర్ 25వ తేదీన జ‌న్మించ‌డంతో ఆ రోజునే క్రిస్మ‌స్ పండ‌గ‌ను జ‌రుపుకొంటారని చెబుతున్నారు.

గొర్రెల కాప‌రిల‌కు క‌నిపించిన దేవ‌దూత ఆ రాత్రి ఆ ఊరి ప‌క్క‌నే పొలాల్లో కొంద‌రు ప‌శువుల కాప‌రులు త‌మ గొర్రెల మంద‌ల‌ను కాప‌లా కాస్తున్నారు. అప్పు‌డు ఒక దేవ‌దూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వ‌చ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల‌కాప‌రులు భ‌య‌ప‌డ్డార‌ట‌. భ‌య‌ప‌డ‌కండి ఇదిగో మీ కోసం సంతోష‌క‌ర‌మైన వార్త‌.. ఈ రోజు బెత్లెహేములోని ఒక ప‌శువుల పాక‌లో లోక ర‌క్ష‌కుడు పుట్టాడు.. ఆయ‌నే అంద‌రికీ ప్ర‌భువు. ఒక ప‌సికందు పొత్తిగుడ్డ‌ల్లో చుట్ట‌బ‌డి ప‌శువుల తొట్టిలో పడుకొని ఉంటాడు. అదే మీకు ఆన‌వాలు. అత‌డే లోక‌ర‌క్ష‌కుడు అని దేవ‌దూత చెప్పాడు. ఇలా క్రిస్మస్ ప్రత్యేక గురించి చెబుతుంటారు.

కాగా, ఈ పండ‌గ క్రిస్మ‌స్‌కు చాలా రోజుల ముందే పండ‌గ సంద‌డి మొద‌ల‌వుతుంది. దీని కోసం క్రైస్త‌వులు త‌మ ఇళ్ల‌ను, చ‌ర్చీల‌ను అందంగా ముస్తాబు చేసుకుంటారు. ఇందు కోసం క్రైస్త‌వులు త‌మ ఇళ్ల‌ను, చ‌ర్చీల‌ను అందంగా అలంక‌రించుకుంటారు. అలాగే ఇంట్లో క్రిస్మ‌స్ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీనిని రంగు రంగుల కాగితాలు, న‌క్ష‌త్రాల‌తో, చిన్న చిన్న గాజుల‌తో అందంగా ముస్తాబు చేసుకుంటారు.

Christmas Celebration: ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. సర్వాంగ సుందరంగా చర్చిలు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..