వైకుంఠ ఏకాదశి వేళ, సింహాచలక్షేత్రం సాక్షిగా, పూసపాటి రాజవంశంలో మరోసారి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు

వైకుంఠ ఏకాదశి వేళ, విశాఖ జిల్లా సుప్రసిద్ధ సింహాచల క్షేత్రం సాక్షిగా, పూసపాటి రాజవంశంలో కుటుంభ సభ్యుల విభేదాలు...

వైకుంఠ ఏకాదశి వేళ,  సింహాచలక్షేత్రం సాక్షిగా, పూసపాటి రాజవంశంలో మరోసారి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 25, 2020 | 1:58 PM

వైకుంఠ ఏకాదశి వేళ, విశాఖ జిల్లా సుప్రసిద్ధ సింహాచల క్షేత్రం సాక్షిగా, పూసపాటి రాజవంశంలో కుటుంబ సభ్యుల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సి౦హాచల౦ అప్పన్నస్వామిని ఒక సాధారణ భక్తురాలిగానే క్యూ లైన్ లలో వెళ్లి దర్శించుకున్నారు ఆనంద గజపతి రాజు భార్య సుధా గజపతి. అయితే, తమకు కనీస ప్రోటోకాల్ ఇవ్వలేద౦టూ సుధాగజపతి ఈ సందర్భంలో తన అస౦తృప్తిని వ్యక్తం చేశారు. “మాకు ప్రోటోకాల్ ఇవ్వద్దని, మాకు ఆహ్వానం పలికితే వారిని సస్పెండ్ చేస్తామని సిబ్బందికి సంచయిత గజపతి ఆదేశించినట్లు తెలిసింది. ఆరిపోయేదీపానికి వెలుగెక్కువ. ప్రతి ఏడాది కుటుంబం అంతా కలిసి దర్శనం చేసుకుంటాం. అధికారుల నుండి మాకు ఈసారి ఎలాంటి ఆహ్వానం కూడా రాలేదు. గతంలో అందరినీ కలుపుకొని వెళ్ళేవాళ్ళం.” అని సుధాగజపతి పలు విమర్శలు చేశారు.