Christmas Celebration: ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. సర్వాంగ సుందరంగా చర్చిలు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..

దేశ వ్యాప్తంగా కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

Christmas Celebration: ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. సర్వాంగ సుందరంగా చర్చిలు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..
Follow us

|

Updated on: Dec 25, 2020 | 5:42 AM

Christmas Celebration: దేశ వ్యాప్తంగా కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్‌ దీపాకాంతులతో ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్‌ శోభ వెల్లివిరుస్తోంది. క్రిస్టియన్లు చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

కాగా, క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా దేశ పౌరులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని పెంపొందించడానికి, మానవాళిలో సామరస్యాన్ని కొనసాగించడానికి ఈ పండుగ దోహదపడుతుందన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాష్ట్రపతి.. ఈ పవిత్ర పండుగ సందర్భంగా క్రీస్తు బోధనలు ప్రేమ, కరుణ, మానవత్వంతోకూడిన బోధనలతో సమాజాన్ని నింపుదామన్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సైతం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, విశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కూడా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ విపక్ష నేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ సైతం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసు ప్రభువు దయతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

Also read:

టెలిగ్రామ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. ఇకనుంచి ఆ ఫీచర్స్ కావాలంటే మనీ కట్టాల్సిందే..

మెగా హీరో కోసం సల్మాన్ ఖాన్ హీరోయిన్.. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్