వికారాబాద్ లో రైలు ఢీకొని ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ముగ్గురు సిబ్బంది ప్రాణాలు గాలిలో కలిశాయి. రైలింజన్ ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ట్రాక్‌పై పెయింటింగ్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ముగ్గురు సిబ్బంది ప్రాణాలు గాలిలో కలిశాయి. రైలింజన్ ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ట్రాక్‌పై పెయింటింగ్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ముగ్గురు సిబ్బంది ప్రాణాలు గాలిలో కలిశాయి. రైలింజన్ ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ట్రాక్‌పై పెయింటింగ్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 12 మంది రైల్వే సిబ్బంది బ్రిడ్జి మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నుంచి వికారాబాద్ వైపు రైలు వచ్చింది. ట్రాక్‌పై పనులు చేస్తున్న సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రైలు దగ్గరికి రావడంతో రైల్వే ఉద్యోగులు గమనించారు. ట్రాక్‌పై నుంచి సిబ్బంది తప్పుకునే లోపే రైలింజన్ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.