హైదరాబాద్‌లో ముస్లింల మిలియన్ మార్చ్ …
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 4న హైదరాబాద్‌లో పలు ముస్లిం సంఘాలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ నిరసనలో పాల్గొన్న ముస్లింలు. మిలియన్ మార్చ్ ప్రభావంతో ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతాలలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తం 40 ముస్లిం సంఘాలతో ఏర్పడిన జేఏసీ ఈ ప్రదర్శనను నిర్వహించింది. జాతీయ జెండాలు, ప్లకార్డు పట్టుకొని చేతభూని..ప్రజా వ్యతిరేక చట్టాలను […]

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 4న హైదరాబాద్‌లో పలు ముస్లిం సంఘాలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ నిరసనలో పాల్గొన్న ముస్లింలు. మిలియన్ మార్చ్ ప్రభావంతో ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతాలలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తం 40 ముస్లిం సంఘాలతో ఏర్పడిన జేఏసీ ఈ ప్రదర్శనను నిర్వహించింది. జాతీయ జెండాలు, ప్లకార్డు పట్టుకొని చేతభూని..ప్రజా వ్యతిరేక చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమంటూ ర్యాలీగా సాగారు నిరసనకారులు. గాంధీ, నెహ్రూ తీసుకొచ్చిన స్వాతంత్య్రం తమకు మళ్లీ కావాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత వి. హనుమంతురావు, తెహారిక్ ముస్లిం షబాన్ కన్వీనర్ ముస్తాన్ మాలిక్, ఎంబీటీ పార్టీ అధ్యక్షుడు అంజాద్ ఉల్లా ఖాన్‌లతో పాటు పలువురు మైనార్టీ, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. కాగా ఈ మిలియన్ మార్చ్‌కి హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతినిచ్చారు.
