AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోకిరి దొంగలు..పోలీస్ స్టేషన్‌నే లూటీ చేశారు!

మన ఇంట్లో ఏవైనా వస్తువులు పోతే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తాం..మరి పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేస్తే?..అవును మీరు వింటున్నది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్టేషన్‌లోకి చొరబడిన దొంగలు.. అక్కడి స్టోర్‌ రూంలో  నుంచి అనేక వస్తువులు ఎత్తుకెళ్లారు. కాగా.. చోరీ జరిగిందనే విషయాన్ని పోలీసులు 24 గంటల దాకా గుర్తించలేకపోవడం కొసమెరుపు. వివరాల్లోకి వెళితే..పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న, రికవరీ చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర వస్తువులను […]

పోకిరి దొంగలు..పోలీస్ స్టేషన్‌నే లూటీ చేశారు!
Ram Naramaneni
|

Updated on: May 22, 2019 | 10:56 AM

Share

మన ఇంట్లో ఏవైనా వస్తువులు పోతే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తాం..మరి పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేస్తే?..అవును మీరు వింటున్నది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్టేషన్‌లోకి చొరబడిన దొంగలు.. అక్కడి స్టోర్‌ రూంలో  నుంచి అనేక వస్తువులు ఎత్తుకెళ్లారు. కాగా.. చోరీ జరిగిందనే విషయాన్ని పోలీసులు 24 గంటల దాకా గుర్తించలేకపోవడం కొసమెరుపు.

వివరాల్లోకి వెళితే..పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న, రికవరీ చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర వస్తువులను పోలీసులు స్టేషన్‌లోని స్టోర్‌రూంలో భద్రపరుస్తుంటారు. సాహిబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లోని స్టోర్‌ రూంలోకి మే 18 అర్ధరాత్రి సమయంలో కొందరు దొంగలు దోపిడీకి పాల్పడ్డారు . 90 బ్యాటరీలు, రెండు గ్యాస్‌ సిలిండర్లు, ఫోన్లు, సీసీటీవీ కెమెరాలు, కార్లలోని విడి భాగాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత మే 20వ తేదీ ఉదయం స్టోర్ ఇన్‌ఛార్జ్‌ గది దగ్గరకు వెళ్లగా తాళం పగలగొట్టి కన్పించింది. దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీతో సంబంధమున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు