రాజమౌళికి సవాల్‌గా చెర్రీ, ఎన్టీఆర్‌ లుక్స్!

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘ఈగ, బాహుబలి’, సినిమాల తర్వాత ఆయన ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. ఇక ఆ తర్వాత ఎంతో క్రేజీగా మల్టిస్టారర్ రూపంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇక ఇందులో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు నటిస్తుండటం మరో విశేషం. అందులో ఎంతో చారిత్రాత్మక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించి లుక్స్‌ కూడా రిలీజ్ చేశారు. అలాగే.. ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి కొన్ని షూటింగ్ […]

రాజమౌళికి సవాల్‌గా చెర్రీ, ఎన్టీఆర్‌ లుక్స్!

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘ఈగ, బాహుబలి’, సినిమాల తర్వాత ఆయన ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. ఇక ఆ తర్వాత ఎంతో క్రేజీగా మల్టిస్టారర్ రూపంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇక ఇందులో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు నటిస్తుండటం మరో విశేషం. అందులో ఎంతో చారిత్రాత్మక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించి లుక్స్‌ కూడా రిలీజ్ చేశారు. అలాగే.. ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి కొన్ని షూటింగ్ సీన్స్ కూడా లీక్‌ అయి వైరల్‌గా మారాయి.

దీంతో.. మరింత జాగ్రత్తగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చేస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తికావొస్తుంది. ఇందులో చెర్రీ సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. వీరి లుక్స్‌ ఎలా ఉంటాయో అన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండే రాజమౌళి వీరిద్దరిని ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్‌‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఎన్టీఆర్, చెర్రీల పోస్టర్స్ కిర్రాక్ రేకెత్తించేలా ఉన్నాయి. మరి సినిమాల్లో కూడా వీరు అలాగే కనిపిస్తారా లేదా అన్నది ఒక పాయింట్. ఏమాత్రం ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ బెటర్ అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి రాజమౌళికి ఎన్టీఆర్, చరణ్‌ల లుక్స్ సవాల్‌గా మారాయి.

అయినా అక్కడున్నది దర్శధీరుడు రాజమౌళి కాబట్టి ఏదో ఒక మ్యాజిక్‌ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. కాగా ఈ చిత్రం జులై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ఒలివియా మోరస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ, పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

Published On - 12:59 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu