దటీజ్ అన్షుల్ సక్సేనా..!
సైబర్ వార్.. ప్రస్తుతం భారత్ పాక్ ల మధ్య ఇంటర్నెట్ యుద్థం జరుగుతోంది. పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే.. మన సైబర్ వరులు బుర్రలకు పనిచెప్పారు. భారత్ ప్రచ్ఛన్న యుద్ధానికి ముందుకు రాకముందే.. మన హ్యాకర్లు కదన రంగంలోకి దూకేశారు. ముందు మన దేశంలోని పాక్ సపోర్టర్స్ నుంచి మొదలు పెట్టి.. పాకిస్తానీ అధికారిక వెబ్ సైట్ల వరకు దేనినీ వదల్లేదు.. ఎవర్నీ విడిచిపెట్టలేదు. అన్షుల్ సక్సేనా.. భారత నెంబర్ వన్ సైబర్ వారియర్. మన సైబర్ […]
సైబర్ వార్.. ప్రస్తుతం భారత్ పాక్ ల మధ్య ఇంటర్నెట్ యుద్థం జరుగుతోంది. పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే.. మన సైబర్ వరులు బుర్రలకు పనిచెప్పారు. భారత్ ప్రచ్ఛన్న యుద్ధానికి ముందుకు రాకముందే.. మన హ్యాకర్లు కదన రంగంలోకి దూకేశారు. ముందు మన దేశంలోని పాక్ సపోర్టర్స్ నుంచి మొదలు పెట్టి.. పాకిస్తానీ అధికారిక వెబ్ సైట్ల వరకు దేనినీ వదల్లేదు.. ఎవర్నీ విడిచిపెట్టలేదు. అన్షుల్ సక్సేనా.. భారత నెంబర్ వన్ సైబర్ వారియర్. మన సైబర్ సెక్యూరిటీకి అండగా నిలుస్తూనే.. పాకిస్తాన్ తాట ఒలుస్తున్నాడు. ఆ దేశానికి.. వారి సైన్యానికి టెర్రరిస్ట్ గ్రూపులకు సపోర్ట్ చేసే వారికి సింహస్వప్నంలా తయారయ్యాడు. పుల్వామా దాడికి సంబంధించిన ఫేస్ బుక్ పోస్టింగ్స్ లో నవ్వే ఎమోజీని పెట్టినవారి ప్రొఫైల్స్ ను తొలగించాడు. పాకిస్తాన్ కు అనుకూలంగా ఫేస్ బుక్ పోస్టింగ్స్ పెడితే.. వారి కంపెనీలకు, కాలేజీలకు, యూనివర్శిటీలకు స్క్రీన్ షాట్లతో సహా మెయిల్స్ చేసి వారి పదవులు ఊడేలా చేశాడు. కొందర్ని పోలీసులకు పట్టించాడు.