స్టెరిలైట్ పరిశ్రమను తెరవొద్దు: సుప్రీం

దిల్లీ: తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్‌ రాగి పరిశ్రమను తిరిగి తెరిచేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పరిశ్రమను తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇచ్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్‌జీటీ)కు ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో మద్రాసు హైకోర్టుకు వెళ్లేందుకు వేదాంత కంపెనీకి న్యాయస్థానం అనుమతిచ్చింది స్టెరిలైట్‌ కర్మాగారం తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతోందని, దీన్ని వెంటనే మూసివేయాలని 2018లో తూత్తుకుడితో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా […]

స్టెరిలైట్ పరిశ్రమను తెరవొద్దు: సుప్రీం
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:45 PM

దిల్లీ: తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్‌ రాగి పరిశ్రమను తిరిగి తెరిచేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పరిశ్రమను తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇచ్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్‌జీటీ)కు ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో మద్రాసు హైకోర్టుకు వెళ్లేందుకు వేదాంత కంపెనీకి న్యాయస్థానం అనుమతిచ్చింది

స్టెరిలైట్‌ కర్మాగారం తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతోందని, దీన్ని వెంటనే మూసివేయాలని 2018లో తూత్తుకుడితో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా 13 మంది మృతిచెందారు. దీంతో ఈ పరిశ్రమను వెంటనే మూసివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనబెట్టి కర్మాగారాన్ని తిరిగి తెరవాలని గతేడాది డిసెంబరులో కాలుష్య నియంత్రణ మండలిని ఎన్‌జీటీ ఆదేశించింది.

దీంతో ఎన్‌జీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇదిలా ఉండగా.. ఎన్‌జీటీ ఆదేశాలను అమలు చేసేలా తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలికి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ వేదాంతా గ్రూప్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. దీనిపై జస్టిస్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి నేడు తీర్పు వెల్లడించింది.స్టెరిలైట్‌ పరిశ్రమను తిరిగి తెరవాలని ఆదేశించేందుకు ఎన్‌జీటీకి ఎలాంటి న్యాయపరమైన అధికారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతానికి ఆ కర్మాగారాన్ని తిరిగి తెరవొద్దని ఆదేశించింది.