డబుల్ ‘విజయ్’ ధమాకా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్!

డబుల్ 'విజయ్' ధమాకా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్!

తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, విజయ్ ‘సంగ తమిజన్’, ‘బిగిల్’ సినిమాలతో దీపావళికి బాక్స్ ఆఫీస్ మీదకు దండయాత్ర చేయనున్నారు. ఇప్పుడు తాజాగా వెండితెరపై కూడా ఈ ఇద్దరు హీరోలు గొడవ పడనున్నట్లు తెలుస్తోంది. హీరో విజయ్ కొత్త చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర కథను సేతుపతికి వినిపించగా.. తన పాత్ర నచ్చి […]

Ravi Kiran

|

Aug 28, 2019 | 12:43 PM

తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, విజయ్ ‘సంగ తమిజన్’, ‘బిగిల్’ సినిమాలతో దీపావళికి బాక్స్ ఆఫీస్ మీదకు దండయాత్ర చేయనున్నారు. ఇప్పుడు తాజాగా వెండితెరపై కూడా ఈ ఇద్దరు హీరోలు గొడవ పడనున్నట్లు తెలుస్తోంది. హీరో విజయ్ కొత్త చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర కథను సేతుపతికి వినిపించగా.. తన పాత్ర నచ్చి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాలు నటిస్తుండగా.. ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏది రాలేదు. ఏది ఏమైనా ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ మాత్రం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

మరోవైపు చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu