AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడినే బార్ గా మార్చిన ఉద్యోగులు

ఆలయాన్నే బార్ గా మార్చేరు ఉద్యోగులు. దేవాల‌య ప్రాంగ‌ణంలో ఓ ఇద్ద‌రు సిబ్బంది మ‌ద్యం సేవించి అడ్డంగా బుక్క‌య్యారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని విరుద‌చ‌లంలో ఆదివారం చోటు చేసుకుంది.

గుడినే బార్ గా మార్చిన ఉద్యోగులు
Balaraju Goud
|

Updated on: Aug 16, 2020 | 4:04 PM

Share

ఆలయాన్నే బార్ గా మార్చేరు ఉద్యోగులు. దేవాల‌య ప్రాంగ‌ణంలో ఓ ఇద్ద‌రు సిబ్బంది మ‌ద్యం సేవించి అడ్డంగా బుక్క‌య్యారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని విరుద‌చ‌లంలో ఆదివారం చోటు చేసుకుంది. విరుద‌చ‌లంలోని శ్రీ కొల‌న్ జీయాప్ప‌ర్ దేవాల‌యాన్ని లాక్‌డౌన్ కార‌ణంగా మూసివేశారు. ప్ర‌స్తుతం ఆ ఆల‌యంలో కేవ‌లం అత్యవసర పూజలు మాత్రమే కొనసాగుతున్నాయి.ఇందుకు పూజారుల‌ను, కొందరు సిబ్బందిని మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. అయితే, ఆదివారం ఉద‌యం ఇద్ద‌రు సిబ్బంది.. ఆల‌యంలోని నంద‌నవ‌నంలో కూర్చుని మ‌ద్యం సేవించారు. అంతేకాదు దేవాలయం ప్రాంగణంలోకి మాంసం కూడా తీసుకువచ్చి తిన్నారు. ఈ దృశ్యాల‌ను కొంద‌రు చిత్రీక‌రించి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేశారు.

కాగా, దీనిపై దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. మ‌ద్యం సేవించిన వ్య‌క్తుల‌ను పుల‌వార్ శివ‌రాజ‌న్, వాచ్‌మెన్ శివ‌కుమార్‌గా అధికారులు గుర్తించారు. వీరిద్ద‌రిని విధుల నుంచి స‌స్పెండ్ చేసినట్లు ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు చెప్పారు. ఇదిలావుంటే ఈ ఆల‌యంపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆలయ ప్రాంగణలో ఉండే 9 మ‌చ్చ‌ల జింక‌లు అనుమానాస్పదంగా చ‌నిపోయాయి. ఆల‌య ప‌రిపాల‌న విభాగం మొత్తం 21 మ‌చ్చ‌ల జింక‌ల‌ను పెంచుతుంది. మరోవైపు అలయ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపలు వెలువడుతున్నాయి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల