ఏపీ గవర్నర్‌కు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ అభినందనలు తెలిపారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి హరిచందన్ కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించిన కేంద్రం… తెలంగాణకు మాత్రం మరొకరిని గవర్నర్‌గా నియమించలేదు. దీంతో ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలకు గవర్నర్ వ్యవహరిస్తున్న నరసింహన్ ఇక తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. దాదాపు తొమ్మిదేళ్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న […]
ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ అభినందనలు తెలిపారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి హరిచందన్ కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించిన కేంద్రం… తెలంగాణకు మాత్రం మరొకరిని గవర్నర్‌గా నియమించలేదు. దీంతో ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలకు గవర్నర్ వ్యవహరిస్తున్న నరసింహన్ ఇక తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా వ్యవహరించనున్నారు.
దాదాపు తొమ్మిదేళ్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్‌కు స్థానచలనం ఉంటుందని చాలాసార్లు ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ పెద్దల దృష్టిలో మంచి మార్కులు వేయించుకున్న నరసింహన్… ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించే విషయంలో తనవంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దీంతో నరసింహన్ స్థానంలో మరొకరిని నియమించడం ద్వారా మళ్లీ కొత్త సమస్యలు వస్తాయని భావించిన కేంద్రం… ఆయననే గవర్నర్‌గా కొనసాగిస్తూ వచ్చింది.