నిమ్స్‌లో మే 1 నుంచి టెలీకన్సల్టెన్సీ సేవలు..

కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. నగరంలో ప్రతిష్టాత్మక నిమ్స్‌ ఆస్పత్రిలో మే 1 నుంచి టెలీ కన్సల్టెన్సీ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

నిమ్స్‌లో మే 1 నుంచి టెలీకన్సల్టెన్సీ సేవలు..

Edited By:

Updated on: Apr 29, 2020 | 8:10 PM

Tele consultancy services: కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. నగరంలో ప్రతిష్టాత్మక నిమ్స్‌ ఆస్పత్రిలో మే 1 నుంచి టెలీ కన్సల్టెన్సీ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కరోనా దృష్ట్యా రోగులకు ఉచితంగా టెలీమెడిసిన్‌ చికిత్స అందించనున్నారు. ఆర్థోపెడిక్‌, జనరల్‌ మెడిసిన్‌, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రూమటాలజీ నిపుణులు టెలీమెడిసిన్‌ సేవలందించనున్నారు. 040-23489244కి ఫోన్‌ చేస్తే ఆస్పత్రి సిబ్బంది అపాయింట్‌మెంట్‌ ఇవ్వనున్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సలహాలు ఇవ్వనున్నారు.