రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం

డిసెంబరు 31 వరకు కోర్టులు అనుసరించాల్సిన ఆన్ లాక్ విధానాన్ని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయించింది.

రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 08, 2020 | 4:45 PM

డిసెంబరు 31 వరకు కోర్టులు అనుసరించాల్సిన ఆన్ లాక్ విధానాన్ని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతుంది. తాజాగా హైదరాబాద్ జిల్లాలోని సివిల్, క్రిమినల్ కోర్టులూ తెరవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో డిసెంబర్ 31వరకు ప్రస్తుత ఆన్ లైన్, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు వీలైనంత వేగంగా విచారణ జరపాలని ప్రత్యేక కోర్టులకు హైకోర్టు సూచించింది. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులు ఇప్పుడు అనుసరిస్తున్న విధానమే కొనసాగించాలని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి

జనవరి ఫస్ట్ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ మస్ట్