అమెరికా అధ్యక్ష పీఠంపై కంగనా జోస్యం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ ఏడాది కాలం ఎక్కువ కాలం పదవిలో ఉండరని జోస్యం చెప్పారు. బైడెన్ అక్రమంగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని అంటూ కంగనా కామెంట్ కూడా చేశారు‌. తప్పకుండా ఏడాది కాలంలో గద్దె దిగుతారని అంటూ ట్వీట్ చేశారు.

  • Sanjay Kasula
  • Publish Date - 4:46 pm, Sun, 8 November 20
అమెరికా అధ్యక్ష పీఠంపై కంగనా జోస్యం

Kangana Calls Joe Biden ‘Gajni’ : మహారాష్ట్ర సర్కార్‌పై విరుచుకుపడుతున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరో సంచలన ట్వీట్‌ చేశారు. ఈ సారి మహారాష్ట్ర రాజకీయాలపై కాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికలను టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడమే కాదు తన జోస్యం కూడా చెప్పారు. అమెరికా ఫూచర్ ప్రెసిడెంట్ ఎవరో కూడా చెప్పేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ ఏడాది కాలం ఎక్కువ కాలం పదవిలో ఉండరని జోస్యం చెప్పారు.బెడెన్‌ను గజినితో పోల్చారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మరిచిపోయే వ్యాది అతనికి ఉందంటూ చెప్పుకొచ్చారు. బైడెన్ అక్రమంగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని అంటూ కంగనా కామెంట్ కూడా చేశారు‌. తప్పకుండా ఏడాది కాలంలో గద్దె దిగుతారని అంటూ ట్వీట్ చేశారు.

అయితే వైస్‌ ప్రెసిడెంట్‌గా గెలిచిన ఇండో అమెరికన్‌ కమలా హారీస్‌కు మాత్రం తన మద్దతు ప్రకటించారు.
బైడెన్‌ గద్దె దిగగానే అమెరికా అధ్యక్ష పగ్గాలను కమలా హారీస్‌ చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు కంగనా. మహిళా శక్తికి కమలా హారీస్‌ నిదర్శమని ప్రశంసించారు.