Telangana: రేవంత్‌ సర్కార్ అరుదైన ఘనత! తొలి ఏడాదిలోనే అర లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. 

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాపాలనే ధ్యేయంగా మునుముందుకు సాగుతుంది. తొలి ఏడాదే రాష్ట్ర యువత జీవితాల్లో కీలక మలుపుకు శ్రీకారం చుట్టింది..

Telangana: రేవంత్‌ సర్కార్ అరుదైన ఘనత! తొలి ఏడాదిలోనే అర లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. 
CM Revanth Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2024 | 3:42 PM

హైదరాబాద్, నవంబర్ 22: ప్రజా పాలనలో తెలంగాణ యువత భవిత మలుపు తిరిగిందా అంటే అవుననే అంటుంది తెలంగాణ ప్రభుత్వం. తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించామంటుంది. ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసింది తెలంగాణ సర్కార్. దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా మొదటి ఏడాదిలోనే 53 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గడిచిన పదేండ్లలో ఉద్యోగాల భర్తీలేక విసిగివేసారిన నిరుద్యోగుల జీవితాల్లో సరికొత్త మార్పు తెచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు. అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం తొలిగించింది. పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాలకు వయో పరిమితిని సడలించింది. గత ప్రభుత్వలో రద్దయినవి.. వాయిదా పడ్డవి.. పెండింగ్‌లో పెట్టిన ఫలితాలన్నింటినీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులందరికీ నియామక పత్రాలను అందించింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్‌ను సైతం ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే… కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది. జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. వీరిలో 10,006 మంది ఉద్యోగాల్లో చేరారు. రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి కొత్త ప్రభుత్వం 8,304 మందికి నియామక పత్రాలను అందించింది.

పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. షెడ్యూలు ప్రకారమే నవంబర్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. టీజీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్‌ల ద్వారా ఈ ఏడాదిలో 3,393 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు, రవాణా శాఖ పరిధిలో 96 మంది ఏఎంవీఐలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించారు.

ఇవి కూడా చదవండి

గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 తుది ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 8,143 మంది ఎంపికైన అభ్యర్థులకు ప్రజా ప్రభుత్వం తొలి విజయోత్సవాల సందర్భంగా నియామక పత్రాలు అందించనుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు ఉన్న అడ్డంకులన్నింటీనీ ప్రభుత్వం అధిగమించింది. ఎంపికైన 16,067 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్వర్యంలో 7094 మంది స్టాఫ్ నర్స్‌ల నియామకాలు విజయవంతంగా పూర్తి చేసింది. వీరిలో 6,956 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది. ఇటీవలే 1,284 ల్యాబ్ టెక్నిషియన్, 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మొత్తం 5,378 పోస్టుల నియామకాలు వివిధ దశల్లో పూర్తి కావల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

62 మందిని చంపిన ఉగ్రవాదికి.. 11 ఏళ్ల తర్వాత అమ్మ గుర్తొచ్చింది
62 మందిని చంపిన ఉగ్రవాదికి.. 11 ఏళ్ల తర్వాత అమ్మ గుర్తొచ్చింది
రేవంత్ సర్కార్ అరుదైన ఘనత!ప్రజా పాలనలో తొలి ఏడాదే యువత భవిత మలుపు
రేవంత్ సర్కార్ అరుదైన ఘనత!ప్రజా పాలనలో తొలి ఏడాదే యువత భవిత మలుపు
రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా 500 నోట్ల కట్ట
రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా 500 నోట్ల కట్ట
ఈ 3రకాల వ్యక్తులకు సాయం చేయడం పాముకు పాలు పొయ్యడమే అంటున్న చాణక్య
ఈ 3రకాల వ్యక్తులకు సాయం చేయడం పాముకు పాలు పొయ్యడమే అంటున్న చాణక్య
NIAలో పనిచేస్తున్న అధికారికి సైబర్ నేరస్థులు ఫోన్.. ఆ తర్వాత
NIAలో పనిచేస్తున్న అధికారికి సైబర్ నేరస్థులు ఫోన్.. ఆ తర్వాత
ఈ నూనెను తక్కువ అంచనా వేయకండి.. ఈ సమస్యలకు దివ్యౌషధం
ఈ నూనెను తక్కువ అంచనా వేయకండి.. ఈ సమస్యలకు దివ్యౌషధం
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇదిగో నోటిఫికేషన్
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇదిగో నోటిఫికేషన్
15 లీటర్ల గీజర్ 10 వేల లోపే ..కొనుగోలు చేయాలా వద్దా?
15 లీటర్ల గీజర్ 10 వేల లోపే ..కొనుగోలు చేయాలా వద్దా?
టెట్‌కు మీరూ దరఖాస్తు చేసుకున్నారా? అయితే కీలక అప్‌డేట్ మీ కోసమే
టెట్‌కు మీరూ దరఖాస్తు చేసుకున్నారా? అయితే కీలక అప్‌డేట్ మీ కోసమే
ఆ దేవాలయం చుట్టూ పక్షుల ప్రదక్షిణలు.. దేవుడి మహిమే అంటున్న జనం
ఆ దేవాలయం చుట్టూ పక్షుల ప్రదక్షిణలు.. దేవుడి మహిమే అంటున్న జనం
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!