ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
ప్రైవేట్ హాస్పిటల్స్‌లోని 50 శాతం పడకలను ఇకపై ప్రభుత్వం అధీనంలో ఉండనున్నాయి. నెల రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
Telangana Private Hospitals: ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లోని 50 శాతం పడకలను ఇకపై ప్రభుత్వం అధీనంలో ఉండనున్నాయి. నెల రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఇప్పటికే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నామని చెప్పిన ఆయన.. మరికొన్ని హాస్పిటల్స్‌కు షోకాజ్ నోటిసులు ఇచ్చామన్నారు. కోవిడ్ రిలేటెడ్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఫిక్స్ చేసిన ధరలకే వైద్య సేవలు అందించాలని శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ కోవిడ్ ట్రీట్‌మెంట్, ప్రోటోకాల్, సర్వీసెస్, ప్రైవేట్ ఆసుపత్రి ఛార్జీలపై విధివిధానాలు రూపొందిస్తామన్నారు. కాగా, గత నాలుగేళ్ల నుంచి 168 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయన్న ఆయన.. వాటిల్లో కరోనా పరీక్షలు నిర్వహించట్లేదని చెప్పారు.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి హెల్ప్‌లైన్..
జేఎన్టీయూ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.!
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..
కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!