ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

భాగ్యనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆదివారాన బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా.. దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున హోం మంత్రి మహమూద్ ఆలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనావాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌లు […]

ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2019 | 12:32 PM

భాగ్యనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆదివారాన బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా.. దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున హోం మంత్రి మహమూద్ ఆలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనావాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌లు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ కేంద్ర మంత్రి, బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వర్ణ కిరీట ధారణి అయిన లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకొని.. బోనాలు సమర్పించి ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.