AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lockdown In Telangana: మరోమారు లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

తెలంగాణ‌లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో రోజుకు వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోమారు లాక్‌డౌన్‌ పక్కా అనే...

Lockdown In Telangana:  మరోమారు లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌
etela
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2021 | 3:31 PM

Share

తెలంగాణ‌లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో రోజుకు వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోమారు లాక్‌డౌన్‌ పక్కా అనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో మరోమారు లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు.

ఏప్రిల్‌ 30 నుంచి 19 జిల్లాల్లో డ‌యాగ్నొస్టిక్ హ‌బ్‌లు ప్రారంభిస్తామ‌ని ఈటల చెప్పారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారికి జిల్లా డ‌యాగ్నొస్టిక్ కేంద్రాల్లో ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారు 3, 4 రోజుల‌కు ఒక‌సారి ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి ఈట‌ల హెచ్చ‌రించారు. తెలంగాణ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల‌కు చెందిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు.

కేంద్రం కేటాయించే వ్యాక్సిన్ల‌ను బ‌ట్టి రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌న్నారు. టీకాలు వ‌చ్చే ప‌రిస్థితిని బ‌ట్టి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌న్నారు. 3.5 కోట్ల టీకాలు 3 నెల‌ల్లో ఇవ్వాల‌ని అనుకుంటున్నాం. దిగుమ‌తి చేసుకునేందుకు కేంద్రం అనుమ‌తి ఇస్తుందా? అని ప్ర‌శ్నించారు. ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకా వేసే అవ‌కాశం ఉంది. టీకా, కొవిడ్ ప‌రీక్ష‌లు వేర్వేరు కేంద్రాల్లో ఉండాల‌న్న వాద‌న కూడా ఉంద‌న్నారు. దీనిపై ఆలోచిస్తామ‌న్నారు. వ్యాక్సిన్ల కోసం ప‌క‌డ్బందీగా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు.

Also Read: కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

  నిజామాబాద్‌ జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌.. చేప‌ల కోసం వ‌ల వేస్తే..

Follow Us
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!