Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ గ్రూప్‌-4 ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 2018లో విడుద‌లైన గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ నేటితో ముగిసింది.

తెలంగాణ గ్రూప్‌-4 ఫ‌లితాలు విడుద‌ల‌
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 06, 2020 | 7:26 PM

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 2018లో విడుద‌లైన గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ నేటితో ముగిసింది. దీంతో 1,595 ఉద్యోగాల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసింది. ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా కోసం https://www.tspsc.gov.in/ ‌వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. టీఎస్పీఎస్సీ ఇప్ప‌టి వ‌ర‌కు 30,723 నియామకాల‌ను చేప‌ట్టిన‌ట్లు కార్య‌ద‌ర్శి వాణి ప్ర‌సాద్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 4 రాత పరీక్షను అక్టోబర్ 7, 2018న నిర్వహించింది. మొత్తం 1,867 ఉద్యోగాలకు 4,80,545 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,046 సెంటర్లు ఏర్పాటు చేశారు. రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు గానూ.. కనీస అర్హత: ఓసీ- 40 శాతం, బీసీ-3 శాతం, ఎస్సీ, ఎస్టీ- 30 శాతం నిర్థారించారు.