Telangana Corona Updates: తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 635 కేసులు..
తెలంగాణలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52,308 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 635 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52,308 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 635 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 2,77,151కి చేరింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం కరోనా బులిటెన్ విడుదల చేసింది. కాగా అటు నిన్న ఒక్కరోజే కరోనా భారిన పడి నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,489కి చేరింది. నిన్న 564 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,67,992కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,670 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,557 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 60,81, 517కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో 141 కేసులు నమోదయ్యాయి.