AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ కామెంట్స్..

రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. ఆర్టీసీ విలీనంతో ఏపీలో ఒక ఎక్సపరిమెంట్ చేశారని, అక్కడ ఏ మనుగడ జరగదని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. వారొక కమిటీ వేశారని ఏమవుతుందో మూడు నెలలకో, ఆరు నెలలకో బయటపడుతుంది చూడండని అన్నారు. అక్కడ జరుగనుంది దేవుడుకే ఎరకని..తాను చెప్తుంది నిజమన్నారు.  […]

ఏపీలో ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ కామెంట్స్..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 24, 2019 | 7:52 PM

Share

రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు.

ఆర్టీసీ విలీనంతో ఏపీలో ఒక ఎక్సపరిమెంట్ చేశారని, అక్కడ ఏ మనుగడ జరగదని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. వారొక కమిటీ వేశారని ఏమవుతుందో మూడు నెలలకో, ఆరు నెలలకో బయటపడుతుంది చూడండని అన్నారు. అక్కడ జరుగనుంది దేవుడుకే ఎరకని..తాను చెప్తుంది నిజమన్నారు.  గవర్నమెంట్‌లో ఆర్టీసీని కలపడం అసంభవం అని..ఈ భూగోళం ఉన్నంతకాలం అది జరిగే పని కాదని తేల్చి చెప్పారు.  ఆర్టీసీ కార్మికులు మంచోళ్లేనని, ఆర్టీసీ ఉన్నతాధికారులు సమర్థులు, మంచోళ్లు.. పంచాయతీ అంతా యూనియన్లతోనేనని, ఇక కార్మికులు ఆలోచించుకోవాలని సూచించారు. యూనియన్‌ ఉచ్చులో పడి మీ రక్తం మీరే పీల్చుకుంటున్నారని, మీ ఆర్టీసీని మీరే కాలబెట్టుకుంటున్నారని కార్మికులను హెచ్చరించారు. అవకతవకలు సరిదిద్దుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఆర్టీసీ కంటే ప్రైవేట్‌ బస్సులు బెటర్‌ సర్వీస్‌ ఇస్తాయని కేసీఆర్‌ చెప్పారు.

Follow Us