AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్.. లేదంటే ఇకపై నో ఎంట్రీ..?

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పునరాగమనంపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్పష్టతనిచ్చాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న ఈ స్టార్ ఆటగాడు తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే ముందుగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు.

హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్.. లేదంటే ఇకపై నో ఎంట్రీ..?
Hardik Pandya, Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Sep 21, 2026 | 12:45 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) ముగిసిన తరువాత ఎలాంటి పోటీ క్రికెట్ ఆడని హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్‌నెస్ సాధించడంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్టుతో జరిగిన టీ20 సిరీస్ విజయానంతరం మీడియాతో మాట్లాడిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక విషయాలు వెల్లడించాడు. అంతర్జాతీయ వేదికపైకి తొందరపడి హార్దిక్‌ను తీసుకువచ్చే ఆలోచన లేదని, ముందుగా ఆయన తన మ్యాచ్ ఫిట్‌నెస్‌ను రుజువు చేసుకోవాలని పేర్కొన్నాడు.

ఒకవేళ ఆయన ఇండియా ఏ (India A) సిరీస్‌లో ఆడితే అప్పుడు వన్డే అలాగే టీ20 జట్లలోకి ఎంపిక చేసే అంశంపై ఆలోచిస్తామని తెలిపాడు. ప్రస్తుతం 10 ఓవర్ల కోటాను పూర్తి స్థాయిలో వేయలేని స్థితిలో ఉన్నాడని, అందుకే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని ఆయన స్పష్టం చేశాడు. రాబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 (ICC ODI World Cup 2027) టోర్నీ దృష్ట్యా హార్దిక్ పాత్ర చాలా కీలకం కానుందని కోచ్ అభిప్రాయపడ్డారు.

IND vs JPN: జపాన్‌తో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్‌గా బుడ్డోడు ఫిక్స్..!

ఇవి కూడా చదవండి

సుమారు ఏడాది తరువాత దక్షిణాఫ్రికా (South Africa) గడ్డపై జరిగే ఈ మహా సంగ్రామంలో పేస్ ఆల్ రౌండర్ అవసరం జట్టుకు ఎంతైనా ఉంటుందని వివరించాడు. హార్దిక్ అందుబాటులోకి వస్తే జట్టు మరింత పటిష్టంగా మారుతుందని ఆయన పేర్కొన్నాడు. కాగా, వెస్టిండీస్ (West Indies) జట్టుతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఈ ఆల్ రౌండర్ దూరమయ్యాడంట. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు గాయపడిన ఆయన ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో ఉన్నాడు.

ఎక్కువమంది చదివినది: ఇంట్లో పులి.. విదేశాల్లో పిల్లి.. అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!

అక్టోబర్ 11వ తేదీ నుంచి ఆస్ట్రేలియా ఏ (Australia A) జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ద్వారా ఆయన మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us