నారావారి పల్లెలో హైడ్రామా! టీడీపీ, వైసీపీ పోటాపోటీ సభలతో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రాజకీయం వేడెక్కింది. నారా వారి పల్లెలో ఇటు టీడీపీ, అటు వైసీపీ పోటాపోటీ సభలు ఏర్పాటు చేయడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఊళ్లో.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహిస్తోన్న ప్రజా సదస్సు.. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 25 వేల మందితో సభను నిర్వహించేందుకు అధికార పార్టీ సిద్ధమవ్వగా, పోటీగా టీడీపీ సైతం శాంతీయుత నిరసన చేపట్టింది. అయితే ఎన్టీఆర్ విగ్రహం […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:39 pm, Sun, 2 February 20
నారావారి పల్లెలో హైడ్రామా! టీడీపీ, వైసీపీ పోటాపోటీ సభలతో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రాజకీయం వేడెక్కింది. నారా వారి పల్లెలో ఇటు టీడీపీ, అటు వైసీపీ పోటాపోటీ సభలు ఏర్పాటు చేయడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఊళ్లో.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహిస్తోన్న ప్రజా సదస్సు.. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 25 వేల మందితో సభను నిర్వహించేందుకు అధికార పార్టీ సిద్ధమవ్వగా, పోటీగా టీడీపీ సైతం శాంతీయుత నిరసన చేపట్టింది. అయితే ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ చేపట్టిన నిరసనకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.  ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’, ‘మూడు రాజధానులు వద్దు – అమరావతే ముద్దు’ అంటూ టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు పోలీసులు కూడా వారిని అడ్డుకుంటూ, అనుమాతుల్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

కాగా వైసీపీ సభకు అనుమతిచ్చి.. తమ పార్టీ సభకు అనుమతివ్వకపోవడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సొంతూరులోని సభలో వైసీపీ మంత్రులు పాల్గొనడమంటే.. ప్రభుత్వం దాడిచేయడమే అని వారు పేర్కొంటున్నారు. అయితే నారావారి పల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ముఖ్యమంత్రి, మంత్రులే బాధ్యత వహించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.