భూమా అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్, ఎన్ని కష్టాలెదురైనా మనోనిబ్బరంతో ముందుకు సాగాలని సూచన

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. ఇటీవల సంచలనం..

  • Venkata Narayana
  • Publish Date - 9:29 pm, Sat, 23 January 21
భూమా అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్, ఎన్ని కష్టాలెదురైనా మనోనిబ్బరంతో ముందుకు సాగాలని సూచన

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. ఇటీవల సంచలనం రేపిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆమెను ధైర్యంగా ఉండాలని చంద్రబాబు నిబ్బరాన్నిచ్చే ప్రయత్నం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మనోనిబ్బరంతో ముందుకు సాగాలని సూచించారు. “మనం ధైర్యంగా ఉంటూ తోటి వారికి ధైర్యం చెప్పాలి.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని” చంద్రబాబు అఖిలప్రియకు సలహానిచ్చారు. కాగా, కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు శుక్రవారం సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.