దేవుడికీ రూ. 2 కోట్ల ఫైన్‌

|

Dec 10, 2019 | 8:21 PM

మనుషులకే కాదు దేవుళ్లకూ తప్పడం లేదు ఇన్‌కమ్‌టాక్స్‌ తిప్పలు. కోట్లకు కోట్లు విరాళాలొస్తున్నా ఆదాయపు పన్ను ఎందుకు కట్టడం లేదంటూ ఏకంగా ఓ ఆలయానికే నోటీసులు పంపారు అధికారులు. ఆలయ ఆదాయంలో 77శాతం పన్ను చెల్లించాలని..అంటే అక్షరాలా 2 కోట్ల రూపాయల పన్ను కట్టాలని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని రంజిత్‌ హనుమాన్‌ మందిరంలో నోట్ల రద్దు సమయానికి 26 లక్షల రూపాయలున్నాయి. దీంతో ఆ నగదు మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు నిర్వాహకులు.  ఐతే ఒకేసారి […]

దేవుడికీ రూ. 2 కోట్ల ఫైన్‌
Follow us on

మనుషులకే కాదు దేవుళ్లకూ తప్పడం లేదు ఇన్‌కమ్‌టాక్స్‌ తిప్పలు. కోట్లకు కోట్లు విరాళాలొస్తున్నా ఆదాయపు పన్ను ఎందుకు కట్టడం లేదంటూ ఏకంగా ఓ ఆలయానికే నోటీసులు పంపారు అధికారులు. ఆలయ ఆదాయంలో 77శాతం పన్ను చెల్లించాలని..అంటే అక్షరాలా 2 కోట్ల రూపాయల పన్ను కట్టాలని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని రంజిత్‌ హనుమాన్‌ మందిరంలో నోట్ల రద్దు సమయానికి 26 లక్షల రూపాయలున్నాయి. దీంతో ఆ నగదు మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు నిర్వాహకులు.  ఐతే ఒకేసారి పెద్దమొత్తంలో మనీ డిపాజిట్‌ చేయడంతో అనుమానమొచ్చిన ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌..ఆలయ ఆదాయంపై లెక్కలు తీసింది. ఏడాదిలోనే రెండు కోట్ల రూపాయలకు పైగా విరాళాలొచ్చినట్లు తేలింది. దీంతో ఇంత ఆదాయమొస్తుంటే పన్ను ఎందుకు కట్టడంలేదనినిర్వాహకులను ప్రశ్నించింది ఐటీ డిపార్ట్‌మెంట్‌. రూల్స్‌ ప్రకారం ఆదాయంపై 77 శాతం పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.ఐతే తాము ఇప్పటివరకు ఆదాయ పన్ను కట్టలేదని..ట్యాక్స్‌ కట్టాలనే విషయం తమకు తెలియదని అంటున్నారు ఆలయ నిర్వాహకులు. ఐటీ అధికారులకు ఇదే నివేదిక సమర్పిస్తామని అంటున్నారు.