Altroz Trim: టాటా మోటార్స్‌ నుంచి ‘ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌’ ఆవిష్కరణ.. ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

Altroz Trim: నూతన కార్ల ఆవిష్కరణలకు పెట్టింది పేరు టాటా మోటర్స్. ఈ కంపెనీ కొత్త సంవత్సరంలో మరో సరికొత్త వేరియెంట్‌ను

Altroz Trim: టాటా మోటార్స్‌ నుంచి ‘ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌’ ఆవిష్కరణ.. ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 2:15 PM

Altroz Trim: నూతన కార్ల ఆవిష్కరణలకు పెట్టింది పేరు టాటా మోటర్స్. ఈ కంపెనీ కొత్త సంవత్సరంలో మరో సరికొత్త వేరియెంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. టాటా మోటార్స్‌ తన పెట్రోల్‌ వేరియంట్‌ ప్రీమియం ‘‘ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌’’ కారును ఆవిష్కరించింది. ఇందులో 1.2 లీటర్‌ టర్బోఛార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 108 బీహెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్‌ సాయంతో కారు కేవలం 12 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 90 పీఎస్‌ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. డీజిల్‌ వేరియంట్‌లోని ఆల్ట్రోజ్‌ మోడల్‌ కార్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45 వేల యూనిట్లను విక్రయించామని, ఇప్పటికీ డిమాండ్‌ బలంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తాజాగా ఆవిష్కరించిన ఈ పెట్రోల్‌ వేరియంట్‌ ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌‌కు ఇదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని వారు ఆకాంక్షిస్తున్నారు.

Keerthy New Look: సర్కార్ వారిపాట కోసం సరికొత్త లుక్‌లో మహానటి.. ఏం మార్పు జరిగిందో తెలుసా..