ఇడ్లీ ఎఫెక్ట్: బామ్మను వెతుక్కుంటూ.. ఆనంద్..!

రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తూ.. పేదల కడుపు నింపుతున్న ఆ బామ్మకు ఇప్పుడు ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడుకు చెందిన కమలాథల్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందించారు. ఆమె వివరాలు చెప్పండీ అంటూ నెటిజెన్లను కోరారు. గత 30 ఏళ్లుగా ఆ బామ్మ కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు వండి అమ్ముతోంది. అయితే ఆమెకు […]

ఇడ్లీ ఎఫెక్ట్: బామ్మను వెతుక్కుంటూ.. ఆనంద్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 12, 2019 | 3:12 PM

రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తూ.. పేదల కడుపు నింపుతున్న ఆ బామ్మకు ఇప్పుడు ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడుకు చెందిన కమలాథల్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందించారు. ఆమె వివరాలు చెప్పండీ అంటూ నెటిజెన్లను కోరారు. గత 30 ఏళ్లుగా ఆ బామ్మ కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు వండి అమ్ముతోంది. అయితే ఆమెకు గ్యాస్ పొయ్యి కొనిచ్చి.. తన వ్యాపారానికి తాను కొంత సాయం చేస్తానని ఆయన ట్వీట్ చేశారు. వెంటనే దీనిపై స్పందించిన కొందరు నెటిజెన్లు ఆయన ట్వీట్‌కి.. రిప్లై ఇస్తూ కమలాథల్ వివరాలు అందించారు.