ఓటీటీలో ‘దట్ ఈజ్ మహాలక్ష్మీ’…

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2020 | 4:02 PM

హీరోయిన్ తమన్నా ప్రధానపాత్రలో నటించిన ''దట్ ఈజ్ మహాలక్ష్మీ'' మూవీ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. హిందీ 'క్వీన్'కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది.

ఓటీటీలో దట్ ఈజ్ మహాలక్ష్మీ...
Follow us on

That Is Maha Lakshmi Movie On OTT Platform: హీరోయిన్ తమన్నా ప్రధానపాత్రలో నటించిన ”దట్ ఈజ్ మహాలక్ష్మీ” మూవీ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. హిందీ ‘క్వీన్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. రెండు సంవత్సరాల క్రితం విడుదలవ్వాల్సిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాస్తా లేట్ అయింది. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించట్లేదు. దీనితో ఈ మూవీను ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.