AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా వాళ్లను రిలీజ్ చేయండి.. లిస్టుతో తాలిబన్లు.. లేదంటే అంతే సంగతులంటూ వార్నింగ్..

తాలిబన్లు, ఆఫ్ఘన్‌ ప్రభుత్వం మధ్య మళ్లీ వాతావరణం వేడెక్కింది. అమెరికా మధ్య వర్తిత్వంతో.. ఇరువురి మధ్య రాజీ కుదిర్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం.. ఖైదీల విడుదలకు ఇరు వర్గాల మధ్య ఒప్పందం..

మా వాళ్లను రిలీజ్ చేయండి.. లిస్టుతో తాలిబన్లు.. లేదంటే అంతే సంగతులంటూ వార్నింగ్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2020 | 8:01 PM

Share

తాలిబన్లు, ఆఫ్ఘన్‌ ప్రభుత్వం మధ్య మళ్లీ వాతావరణం వేడెక్కింది. అమెరికా మధ్య వర్తిత్వంతో.. ఇరువురి మధ్య రాజీ కుదిర్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం.. ఖైదీల విడుదలకు ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ప్రభుత్వ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఐదు వేల మంది తాలిబన్లను విడిచిపెట్టాలని.. ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని తాలిబన్లు కోరారు. అందుకు గాను.. తమ వద్ద బంధీలుగా ఉన్న 737 మంది ఆఫ్ఘన్ జవాన్లను విడిచిపెడతామని తెలిపారు.

అంతేకాదు.. ఒప్పందం ప్రకారం.. ఆఫ్ఘన్ సైనికులను తాలిబన్లు విడిచిపెట్టారు. అయితే ఆఫ్ఘన్ ప్రభుత్వం మాత్రం ఒప్పందం ప్రకారం కాకుండా.. కేవలం 4,019 మంది తాలిబన్లను మాత్రమే విడిచిపెట్టింది. మిగతా 597 మందిని విడిచిపెట్టకుండా జైళ్లోనే ఉంచింది. ఈ 597 మంది దేశంలో జరిగిన అనేక నేరాలతో పాటు.. పలు దాడుల్లో కూడా పాల్గొన్నారని.. వీరిని విడిచిపెట్టడం కుదరదని ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్లకు తేల్చిచెప్పింది. అయితే తమ వారిని విడిచిపెట్టే వరకు ఎలాంటి రాజీ కార్యకలాపాల్లో పాల్గొనమంటూ తాలిబన్లు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. 592 మందితో ఓ లిస్టును ప్రిపేర్ చేసి.. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ లిస్టులో ఉన్న వారిని విడిచి పెడితే.. తరువాత సంధి కార్యకలాపాల్లో పాల్గొంటామని.. లేదంటే చర్చలకు స్వస్థి పలుకుతామని హెచ్చరించింది.

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..
గోవా రికార్డు బ్రేక్! 2025లో ఎంతమంది వెళ్లారో తెలిస్తే షాకే..
గోవా రికార్డు బ్రేక్! 2025లో ఎంతమంది వెళ్లారో తెలిస్తే షాకే..