Sushant Hand-Written Note: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవితం ఎగసి పడిన కెరటాన్ని గుర్తుకు తెస్తుంది.. తన జీవితంలో ఓ స్టేజ్ కు రావడానికి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. తనకంటూ ఓ ఫేమ్ వచ్చిన తర్వాత హఠాత్తుగా ఆత్మహత్య చేసుకొని జీవిత నుంచి తెరమరుగయ్యారు. జనవరి 14 కి సుశాంత్ మరణించి 7 నెలలు. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని అతని సోదరి సుశాంత్ ను జ్ఞాపకం చేసుకుంది. శ్వేతా సింగ్ కీర్తి బుధవారం సుశాంత్ చేతి రాత తో ఉన్న ఓ ఉత్తరాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఉత్తరలోని సుశాంత్ ఆలోచనలు ఆవిష్కరించాడు.. ఆ లేఖను చదివిన వారికి కంట నీరు రాకమానదు.
నేను నా జీవితంలో 30 ఏళ్ళు గడిపాను. ఏదో కావాలని ప్రయత్నించాను.. ఎప్పుడూ అందరితో మంచిగా ఉండలని భావించాను. అంతేకాదు చదువుకునే సమయంలో టెన్నిస్ క్రీడాకారుడు కావాలని.. ఎప్పుడు స్కూల్ లో మంచి ర్యాంక్ లు తెచ్చుకోవాలని కోరుకున్నాను. నేను ఎప్పుడూ అదే దృక్పధంలో ఆలోచించాను అయితే నేను నడిచిన దారిలో ఏదీ నాకు బాగోలేదు. కానీ ఆ దారిలో కొంత మంచిని కూడా పొందాను . ఏది ఏమైనా నేను ఆడిన ఆటలో తప్పులు అని గ్రహించానని… ఆ లేఖలో సుశాంత్.. తన మనసుని భవిష్యత్ పై తన కలలు, కోరికలను ఆవిష్కరించాడు. ఈ లెటర్ ను చదివిన ఫ్యాన్స్ కన్నీరు పెడుతున్నారు. జీవితం మీద ఇన్ని ఆశలు.. కోరికలు ఉన్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం తాము జీర్ణించుకోలేక పోతున్నామంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు.. నీ ఆలోచనలు ఎంతో గొప్పవి భాయ్ .. ఫర్ ఎవర్ సుశాంత్ అతను హ్యాష్ ట్యాగ్ తో లెటర్ ను షేర్ చేస్తున్నారు.
Also Read:
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగభాగ్యాలు కలగాలంటూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు