AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ ఏజెన్సీలో దారిదోపిడీ దొంగలు, నాటు తుపాకులతో బెదిరింపులు, పండక్కి ఊరెళ్ళే వాళ్లే టార్గెట్

విశాఖ ఏజెన్సీలో దారిదోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పండక్కి ఊరెళ్ళే వారు, రాత్రిపూట ప్రయాణించేవారిని టార్గెట్ చేస్తున్నారు. జీకే వీధి మండలం..

విశాఖ ఏజెన్సీలో దారిదోపిడీ దొంగలు, నాటు తుపాకులతో బెదిరింపులు, పండక్కి ఊరెళ్ళే వాళ్లే టార్గెట్
Venkata Narayana
|

Updated on: Jan 13, 2021 | 1:28 PM

Share

విశాఖ ఏజెన్సీలో దారిదోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పండక్కి ఊరెళ్ళే వారు, రాత్రిపూట ప్రయాణించేవారిని టార్గెట్ చేస్తున్నారు. జీకే వీధి మండలం దారాలమ్మ ఘాట్ రోడ్ ను కేంద్రంగా చేసుకుని బరితెగిస్తున్నారు దొంగలు. ఇవాళ ఒక్కరోజే రెండు చోట్ల దోపిడీ చేసి బీభత్సం సృష్టించారు. నాటు తుపాకులతో బెదిరించి దోచుకుంటున్నారు. తప్పించుకోవడానికి యత్నించే వారి వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండల కేంద్రం నుంచి సీలేరు వరకు ఉన్న 50 కిలోమీటర్ల ఘాట్ రోడ్ అత్యంత ప్రమాదకరమైన అడవి ప్రాంతం కావడంతో అక్కడే  దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. అటు, పర్యాటకుల వాహనాలను అడ్డగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సీలేరు నుంచి గూడెం కొత్తవీధి వెళ్తున్న టూరిస్టులను దారాలమ్మ తల్లి ఆలయ రెండవ ఘాట్ రోడ్డు దగ్గర రోడ్డుకి అడ్డంగా బండరాళ్లను ఉంచి దోపిడీకి యత్నించారు.

ఈ దోపిడీలో ఇద్దరు వ్యక్తుల దగ్గర నాటు తుపాకీలు కూడా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. వారి వల్ల ముప్పు ఉందని గమనించి కారులో ఉన్న వ్యక్తులు వేగంగా కారుని వెనక్కి తిప్పుకొని వెళ్లిపోతుంటే, ఇనుప రాడ్లతో కారు అద్దాలను పగులగొట్టారని బాధితులు వాపోతున్నారు. అదేవిధంగా  పాల్వంచ నుంచి అర‌కు వెళుతున్న ప‌ర్యాట‌కుల వాహ‌నాన్ని దుండ‌గులు అట‌కాయించి వారి వ‌ద్ద నుంచి రూ.35 వేలు న‌గ‌దు, నాలుగు సెల్ ఫోన్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. గంట వ్యవ‌ధిలో సీలేరు నుంచి విశాఖ వెళుతున్న కారును దుండ‌గులు అట‌కాయించి వారి వ‌ద్ద నుంచి ఐదు తులాలు బంగారం దొంగిలించారు. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భ‌యాందోళ‌న నెల‌కొంది. దీంతో పండుగ‌కు వెళుతున్న వారు త‌మ ప్రయాణాల‌ను సైతం వాయిదా వేసుకుంటున్నారు.

Follow Us