తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అటు విమర్శకులు, ఇటు అభిమానులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సూర్య యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఇక తాజాగా ఈ మూవీని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫీలింగ్‌ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకోవడమే కాకుండా సూర్య నటనకు ఫిదా అయినట్లు చెప్పుకొచ్చారు. సుధా కొంగర టేకింగ్ బాగుందని మహేష్ బాబు కితాబిచ్చారు. దీనిపై సూర్య కూడా తన స్పందనను తెలియజేస్తూ స్పెషల్ థాంక్స్ చెప్పారు. ”థ్యాంక్స్ ఏ టన్.. బ్రదర్.! నీ ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. దీనితో ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, ప్రస్తుతం సూర్య తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
Also Read:
పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..
@urstrulyMahesh very kind of you brother! Thanks a ton! Looking forward for #SarkaruVaariPaata ?? https://t.co/E0xumD7RfI
— Suriya Sivakumar (@Suriya_offl) November 19, 2020