క‌రోనా రోగికి‌ ఒకేసారి రెండు ఊపిరితిత్తుల మార్పిడి

కోవిడ్-19 బాధితుడికి రెండు ఊపిరితిత్తులు ఒకేసారి మార్పిడిచేసి అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకుంది భారతీయ అమెరికన్ డాక్ట‌ర్ నేతృత్వంలోని టీమ్.

  • Ram Naramaneni
  • Publish Date - 11:08 pm, Sun, 12 July 20
క‌రోనా రోగికి‌  ఒకేసారి రెండు ఊపిరితిత్తుల మార్పిడి

కోవిడ్-19 బాధితుడికి రెండు ఊపిరితిత్తులు ఒకేసారి మార్పిడిచేసి అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకుంది భారతీయ అమెరికన్ డాక్ట‌ర్ నేతృత్వంలోని టీమ్. ఇల్లినాయిస్‌కు చెందిన ఓ కోవిడ్ పేషెంట్ కి గత 100 రోజులుగా ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజెనేషన్‌ (ఈసీఎంవో) సాయంతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అత‌డికి రెండు లంగ్స్ పాడ‌యిపోవ‌డంతో.. షికాగోలోని నార్త్‌ వెస్టర్న్‌ మెమోరియల్ ఆస్ప‌త్రిలో థొరోసిక్‌ సర్జరీ డిపార్టిమెంట్ హెడ్ గా వ‌ర్క్ చేస్తోన్న‌ అంకిత్‌ భరత్‌ అనే భారతీయ అమెరికన్‌ వైద్యుడి నేతృత్వంలో ఒకేసారి రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. గత నెలలో కూడా 20 ఏండ్ల యువతికి అంకిత్‌ ఇలాంటి ఆప‌రేష‌న్ చేసిన‌ట్లు ఆస్ప‌త్రి సిబ్బంది తెలిపారు.

 

Surgeons led by Indian-origin doctor perform double lung ...