అయోధ్య కేసులో కీలక మలుపు.. రివ్యూ పిటిషన్ వేయం.. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన ప్రకటన

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇఛ్చిన నేపథ్యంలో తాము దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని యూపీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఈ బోర్డు చైర్మన్ జాఫర్ అహ్మద్ ఫరూఖీ స్పష్టం చేస్తూ.. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. తీర్పును కూలంకషంగా అధ్యయనం చేస్తామని, అనంతరం తమ బోర్డు వివరణాత్మక స్టేట్ మెంట్ ఇస్తుందని ఆయన అన్నారు. ఏ లాయరైనా, వ్యక్తి అయినా బోర్డు ఈ తీర్పును సవాల్ చేస్తుందని […]

అయోధ్య కేసులో కీలక మలుపు.. రివ్యూ పిటిషన్ వేయం.. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన ప్రకటన
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 09, 2019 | 5:50 PM

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇఛ్చిన నేపథ్యంలో తాము దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని యూపీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఈ బోర్డు చైర్మన్ జాఫర్ అహ్మద్ ఫరూఖీ స్పష్టం చేస్తూ.. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. తీర్పును కూలంకషంగా అధ్యయనం చేస్తామని, అనంతరం తమ బోర్డు వివరణాత్మక స్టేట్ మెంట్ ఇస్తుందని ఆయన అన్నారు. ఏ లాయరైనా, వ్యక్తి అయినా బోర్డు ఈ తీర్పును సవాల్ చేస్తుందని చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. రివ్యూ పిటిషనే కాదు.. క్యురేటివ్ పిటిషన్ కూడా దాఖలు చేయబోమన్నారు. . దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాగా-కోర్టు తీర్పు పై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని అంతకుముందు బోర్డు తరఫు లాయర్ జఫర్యాబ్ జిలానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.