ఎంత మంచి మనసయ్యా నీది.. సోనూ సూద్.. నువ్వే మా రియల్ హీరో..
కోవిద్-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమైంది. వలస కార్మికులకు అండగా నిలుస్తూ

కోవిద్-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమైంది. వలస కార్మికులకు అండగా నిలుస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూసూద్ చిత్రాన్ని.. ప్రముఖ ఆర్టిస్ట్ పద్మశ్రీ గ్రహీత సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో చిత్రీకిరించాడు. కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న వారందరికీ దేవుడిలా అండగా నిలిచాడు సోనూసూద్.
కాగా.. శాండ్‌ఆర్ట్ ను తన వృత్తిగా మార్చుకున్న సుదర్శన్ పట్నాయక్ రియల్ హీరో సోనూ సూద్‌కి అభినందనలు తెలిపేందుకు ఒడిశాలోని పూరీ బీచ్‌ను ఎంచుకున్నాడు. పూరీ బీచ్ లో సోనూసూద్ బొమ్మను చిత్రించి ‘కరోనా సమయంలో యు ఆర్ ద రియల్ హీరో మీకు కృతజ్ఞతలు తెలిపేందుకు నాకు ఇంతకంటే ఏం చేయాలో తెలియట్లేదు అనే శీర్షికతో శాండ్‌ఆర్ట్‌ను సోనూకి అంకితం చేశాడు పట్నాయక్.
శాండ్‌ఆర్ట్ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ సోనూసూద్‌కు ట్యాగ్ చేశాడు. ‘థ్యాంక్యూ తమ్ముడు. ఈ ఆర్ట్ నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నది. లవ్ యూ సో మచ్. ఒకసారి నిన్ను కలిసి గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది’ అని సోనూ రీట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో వైరల్‌గా మారింది.
[svt-event date=”01/06/2020,5:50PM” class=”svt-cd-green” ]
We salute your noble deeds @SonuSood Ji . Even words are not enough to describe your help to the helpless during this #CoronaPandemic time. My SandArt at Puri beach in Odisha with Respect and Gratitude ? pic.twitter.com/DFoLzS4wvc
— Sudarsan Pattnaik (@sudarsansand) June 1, 2020
[/svt-event]



